నాటా సేవా దినోత్సవానికి సీఎ

news

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) డిసెంబరు 29న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన నాటా సేవా దినోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. నాటా పబ్లిక్ రిలేషన్స్ ఛైర్ మహేష్ బిగాల, ఇండియా కోఆర్డినేటర్ ద్వారకనాథరెడ్డి, గోపీనాథ్ వెదెరెలు సీఎం క్యాంప్ ఆఫీసులో కిరణ్ ను కలిసి రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరినట్లు నాటా అధ్యక్షుడు ఏవీఎన్ రెడ్డి తెలిపారు. ఆ రోజున నాటా నిర్వహించే కార్యక్రమాలతో పాటు హోస్టన్ లో వచ్చే ఏడాది జరిగే కన్వెన్షన్ గురించి ముఖ్యమంత్రికి నాటా బృందం వివరించింది. ప్రవాసాంధ్రుల కోసం ఎన్.ఆర్.ఐ సెల్ ఏర్పాటు చేయాల్సింది వారు సీఎంను కోరారు. ‘‘‘‘నాటా ఆరోగ్య శిబిరాలు, నీటి ప్రాజెక్టులు, విద్యార్థుల ఉపకార వేతనాల గురించి సీఎం తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన స్పందన మాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని ఏవీఎన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. డిసెంబరు 19న తిరుపతిలో మొదలయ్యే నాటా సేవా కార్యక్రమాలు 29న హైదరాబాద్లో ముగుస్తాయని కోఆర్డినేటర్ బాల ఇందుర్తి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. నెల్లూరులో ప్రేమ్ రెడ్డి, గుంటూరులో కోటేశ్వరరావు, వరంగల్ లో డాక్టర్ సాంబరెడ్డి, నిజామాబాద్ లో మోహన్ పటాలోళ్ల శిబిరాలకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తారు. దీంతో బాటు నల్గొండ జిల్లాలో నీటి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. వీటికి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి స్పాన్సర్. 29న హైదరాబాద్ లో నూ సేవా కార్యక్రమాలు జరుగుతాయి. తాజ్ దక్కన్ లో ఉదయం నుంచి బిజినెస్ సెమినార్లు, కవి సమ్మేళనంతో బాటు సీఎంఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. సాయంత్రం రవీంద్ర భారతిలో ఉపకార వేతనాల ప్రదానం ఘనంగా జరుగుతుంది.

 

 

 Mar 13 2015