NATA Women's Day @Charlotte - A Grand Success
Charlotte: North American Telugu Association (NATA) has hosted NATA Women’s day event in Charlotte, North Carolina with great pomp and gaiety. Over 300 women from all walks of life have attended this event. NATA president Dr. Raghava Reddy Ghosala Garu has addressed the gathering and outlined various activities being undertaken by NATA.
NATA Motto is “Samskruthika Vikasame Naataa mata Samaja Sevaye Nataa bata” and this event has raised funds for a local non-profit organization, which tackles human trafficking. Anchor Sameera Illendula has entertained the audience with lots of games and raffle gifts. A spoof skit on the mythological characters scripted by Anuradha Pannem had the audience burst into laughter. Fashion show conducted by Sunita Sounderajan, which was an ode to the weavers of India was elegant to watch. Dance performances choreographed by Durga Sailaja Daliparthi and Lavanya Konuri were foot tapping. Great ambience, delicious food, wonderful crowd all together accounted for a very successful memorable event for Telugu Community in North Carolina. Participants thanked NATA Charlotte Team for conducting such a great event.
షార్లెట్ నగరంలో జరిగిన నాటా మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం
నార్త్ కరోలినా: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) మహిళా దినోత్సవ వేడుకలను నార్త్ కరోలినా రాష్ట్రం లోని షార్లెట్ నగరం లో అతి వైభవంగా జరుపుకున్నారు. నాటా ప్రెసిడెంటు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వచ్చి నాటా తలపెట్టిన అనేక కార్యక్రమాలని అందరికీ వివరించారు. 300 పైగా మహిళామణులు పాల్గొన్న ఈ కార్యక్రమం సమీరా ఇళ్ళెందుల గారి చలాకి ఆంకరింగ్ తో, సరదా సరదా ఆటలతో, సందడి సందడి గా సాగింది. అనురాధా పన్నెం గారి దర్శకత్వం లో ప్రదర్శించిన నాటిక అందరిని కడుపుబ్బ నవ్వించింది. సునీత సౌందరరాజన్ గారి చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో హుందాగా సాగింది. దుర్గా శైలజ దలిపర్తి, లావణ్య కోనురి గార్ల నిర్వహణ లో సాగిన నాట్య విన్యాసాలు అందరిని ఆనందపరిచాయి.
నాటా నినాదం అయిన సాంస్కృతిక వికాసమే నాటా మాట, సమాజ సేవయే నాటా బాట ను ఆచరిస్తూ ఆటపాటలే ముఖ్యోద్దేశం కాకుండా సేవాతత్వం తో విరాళాలు సేకరించి షార్లెట్ లో స్వచ్చందం గా సేవలు అందించే లిల్లిపాడ్ హేవన్ అనే సంస్థకి విరాళాలు అందించడం మరో విశెషం. నాటా షార్లెట్ కార్యవర్గం తలపెట్టిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా అర్ధరాత్రి వరకు విజయవంతం గా సాగి, షార్లెట్ లో ప్రతి తెలుగు వారు గుర్తుంచుకునేలా ఒక మచ్చుతునకగా నిలిచిపోయినది. ఈ మహిళా దినోత్సవం లో పాలుపంచుకొన్న మహిళామణులు అందరూ ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నాటా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు.
May 10 2019